కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజాస్వామ్య మనువడకే ప్రమాద ఉందని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బిజెపి టిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర లో బిజెపి విధానాలను ఎండకట్టడంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నారని తెలిపారు.దేశ సొమ్మును కొన్ని కార్పొరేట్ శక్తులకు ప్రధాని అప్పగించారని రాబోయే రోజుల్లో […]

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజాస్వామ్య మనువడకే ప్రమాద ఉందని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బిజెపి టిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర లో బిజెపి విధానాలను ఎండకట్టడంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నారని తెలిపారు.దేశ సొమ్మును కొన్ని కార్పొరేట్ శక్తులకు ప్రధాని అప్పగించారని రాబోయే రోజుల్లో అన్ని రంగాలు ప్రైవేట్ పరం అయ్యే అవకాశం ఉందని రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా ఎన్నో విషయాలు ప్రజలకు తెలిసాయి అన్నారు. దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తోందని విమర్శించారు.

పోరాడే సాధించకుండా తెలంగాణ అప్పుల ఊబిలో కురుకపోయిందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని బట్టి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్‌ఎస్ ప్రమాదకరంగా మారిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాలేదని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ హయాంలోనే కట్టినవి అని బట్టి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాదులో భూముల రేట్లు పెరగడానికి కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోనే సాధ్యమైందన్నారు. అలాంటి లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం పాటుపడాలని బట్టి విక్రమార్క కోరారు.

Updated On 4 March 2023 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story