తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం వచ్చింది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌(BRS) ప్రతిపక్షంలో కూర్చుంది. ఇంతకాలం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్కాన్‌ చేస్తోంది రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం. బీఆర్‌ఎస్ పార్టీకే చెందిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) తీసుకున్న నిర్ణయాలపై కూడా నజర్‌ పెట్టింది.

తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం వచ్చింది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌(BRS) ప్రతిపక్షంలో కూర్చుంది. ఇంతకాలం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్కాన్‌ చేస్తోంది రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం. బీఆర్‌ఎస్ పార్టీకే చెందిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) తీసుకున్న నిర్ణయాలపై కూడా నజర్‌ పెట్టింది. మేయర్‌(Mayor) జారీచేసే ఆదేశాలను ఇకపై తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి అధికారులు వచ్చారట! ఆమె ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా తేలిగ్గా తీసుకోవాలని భావిస్తున్నారట. జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ రోనాల్డ్ రోస్(Ronald Rose) నిర్వహించిన జోనల్ కమిషనర్ల సమావేశంలో మౌఖిక ఆదేశాలు జారీ చేశారట! గ్రేటర్‌ హైదరాబాద్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా నగరంలోని ఆరు జోన్‌లలో జీతాల చెల్లింపు ప్రక్రియను తెలుసుకోవటంతో పాటు ఇతర పౌరసేవల నిర్వహణ, వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై కమిషనర్ మొన్న ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వాహించారట. ఈ సమీక్షలో మేయర్ జారీ చేసిన పలు ఆదేశాలను జోనల్‌ కమిషనర్లు కమిషనర్‌కు వివరించారట! ఇకపై మేయర్‌ ఆదేశించే పనులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కమిషనర్‌ ఆదేశించారని వినికిడి!

Updated On 22 Dec 2023 5:24 AM GMT
Ehatv

Ehatv

Next Story