ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. ప్రకటించిన ఐదుగురిలో పెద్దపల్లె నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి ఉన్నారు.
ప్రకటించిన ఐదుగురు అభ్యర్థులలో సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి సహా ముగ్గురు అభ్యర్థులు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం టికెట్ కోసం మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి మల్లు రవి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. అదేవిధంగా చేవెళ్ల నుంచి సునీత మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ తొలి జాబితాలోనే ప్రకటించినప్పటికీ.. చివరి నిమిషంలో ఆమె అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఇప్పుడు మల్కాజిగిరి కేటాయించింది.
రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, భువన గిరి, మెదక్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.