టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal) ప్రకటించారు. రెండు రోజుల చర్చోపచర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఏఐసీసీ(AICC) కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కొత్త ముఖ్యమంత్రి(Cheif Minister)గా ప్రకటించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి నిన్న సీఎల్పీ(CLP) భేటీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలిపారు. ఎల్లుండి(7వ తేదీ) రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం(Oath) చేస్తారన్నారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు(Congress Leaders) అందరూ టీమ్ వర్క్(Team Work) చేస్తారని చెప్పారు.

Updated On 5 Dec 2023 9:23 AM GMT
Yagnik

Yagnik

Next Story