తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.
తెలంగాణ(Telangana)లో లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections) పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ ఇటీవల పలు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా.. తాజాగా మరో నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన వెలువడింది. మెదక్, అదిలాబాద్, భువనగిరి, నిజామాబాద్ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కోంది. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఇటీవల బీఎస్పీ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నీలం మధుకు టికెట్ దక్కింది. అదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఆత్రం సుగుణను ఫైనల్ చేశారు. ఇక భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. నిజామాబాద్ స్థానం నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డికి అవకాశం కల్పించింది. మొత్తం 17 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సివుండగా.. గతంలో 9, ఇప్పుడు 4 స్థానాలకు అభ్యర్ధులు ఖరారయ్యారు. మరో నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సివుంది.