రాష్ట్రంలో 50లక్షల మంది విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగిన విద్యార్ధి-నిరుద్యోగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. 1969లో మా ఉద్యోగాలు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే మొదలైందని గుర్తుచేశారు.

Cong will win 90% of seats in Assembly polls, asserts Revanth
రాష్ట్రంలో 50లక్షల మంది విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగిన విద్యార్ధి-నిరుద్యోగ సభ(Vidyarthi-Nirudhyoga Nirasana)లో ఆయన ప్రసంగిస్తూ.. 1969లో మా ఉద్యోగాలు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యమం(Telangana Movement) ఖమ్మం జిల్లా(Khammam District)లోనే మొదలైందని గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్(CM KCR) చెప్పిండు.. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు, మేధావులకు, అమరుల కుటుంబాలకు నేను గుర్తు చేయదలచుకున్నా.. తెలంగాణ ఏర్పడిన తరువాత 1లక్ష 7వేలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీ(Assembly)లో చెప్పారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప.. కొత్త ఉద్యోగాలు రాలేదని వివరించారు. 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కేసీఆర్ మారిండేమో అనుకున్నాం.. కానీ ఇవాళ జరిగిందేంటో మీకు తెలుసు.. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు బజార్లో దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్(TSPSC Paper Leakage) అయ్యాయి. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చేలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. పంపకాల్లో తేడాలు వచ్చి విషయం బయటపడింది తప్ప ప్రభుత్వం చేసిందేం లేదని విమర్శించారు. మేం నిలదీస్తే విచారణ అధికారులు మాకు నోటీసులు ఇచ్చారు. కొడుకును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటే.. కేసీఆర్ నాకు నోటీసులు పంపించారని పేర్కొన్నారు. నాపై ఇప్పటికే.. 130 కేసులు పెట్టినవ్ కేసీఆర్... ఇంతకంటే ఇంకేం చేస్తావ్.. అని సభావేధిక నుంచి ప్రశ్నించారు.
హైదరాబాద్(Hyderabad) లో జరిగే నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) హాజరవుతారని తెలిపారు. ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా ప్రజలను కోరారు. ఖమ్మం జిల్లాలో ఒంటి కన్ను శివరాసన్ ను పాతాళానికి తొక్కేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ కు ఇవ్వండి.. రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటామన్నారు.
