CM Revanth Reddy : సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, పరువునష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ.. బీఆర్‌ఎస్ నేతలు మంగళవారం రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, పరువునష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ.. బీఆర్‌ఎస్ నేతలు మంగళవారం రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం పంజాగుట్టలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌లు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వాడిన పదజాలం హింసను రెచ్చగొట్టేలా, ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా, మన సమాజం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ.. ఈ వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైన.. నేరపూరితమైనవిగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసీఆర్‌పై ఆయన చేసిన నిరాధారమైన ఆరోపణలు, వ్యక్తిగత దాడి అగౌరవంగా ఉండటమే కాకుండా చట్టవిరుద్ధం.. ఇటువంటి ప్రవర్తన ముఖ్యమంత్రికి తగదు. ఇలాంటి చర్యలు ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దెబ్బతీస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. హింసను ప్రేరేపించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చట్ట ప్రకారం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులను కోరారు.
బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు.. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు.. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయండి అంటూ సవాల్ విసిరారు. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితం అని ఫైర్ అయ్యారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదన్నారు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలం