తెలంగాణలో(Telangana) చలి రోజురోజుకూ పెరుగుతుంది. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) తగ్గుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలో చల్ల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad), కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి

తెలంగాణలో(Telangana) చలి రోజురోజుకూ పెరుగుతుంది. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) తగ్గుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలో చల్ల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad), కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో ఉష్ణోగ్రత 9.4గా నమోదైంది. సిర్పూర్‌లో(Sirpur) 10.4 డిగ్రీలు నమోదు కాగా పెంబీలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత మమోదైంది. మంచిర్యాల జిల్లా భీమినిలో 14.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు చల్ల గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 11-15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో మంచు(Snow) కూడా కురవడంతో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ఏపీ కంటే తెలంగాణలోనే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated On 20 Dec 2023 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story