గ్రూప్- 2 పరీక్షలను వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
గ్రూప్- 2 పరీక్షలను వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అభ్యర్థులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కొందరు ఎంపీలు చర్చించిన తర్వాత పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆగస్టులో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్పీ ఉత్వర్వులు జారీ చేసింది. పరీక్షల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కూడా తెలిపంది.
తెలంగాణ రాష్ట్రం(Telangana) ఏర్పడిన తర్వాత 2016లో మొట్టమొదటిగా గ్రూప్-2(Group-2) నియామకాలు జరిగాయి. తర్వాత 2022 డిసెంబరు 29న రెండోసారి గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. 783 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ప్రకటన జారీ చేసింది. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 ఆగస్టు, 2024 జనవరిలో జరగాల్సిన పరీక్షలు ఎన్నికలు, ఇతర కారణాలతో రెండుసార్లు వాయిదా పడ్డాయి. కానీ 2024 ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. కానీ నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పటి ఖాళీల ప్రకారం పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు పట్టుబడుతున్నారు. డీఎస్పీ పరీక్(DSC Exam)ష రాసిన వారిలో చాలా మంది గ్రూప్-2కి కూడా దరఖాస్తు చేసకున్నారని, ఇందుకు ప్రిపరేషన్ కోసమని వాయిదా వేయాలని కోరుతూ వచ్చారు. దీనిపై గత నెలరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు నిరుద్యోగులు.
మరో కారణం ఏంటంటే గ్రూప్-2 రాసే అభ్యర్థుల్లో చాలా మంది గ్రూప్-3 కూడా రాస్తారు. ఈ రెండు పరీక్షలకు సిలబస్ చాలావరకు ఒకేలా ఉంటుంది. ఒక్క పేపర్ మాత్రమే తేడా ఉంటుంది. గ్రూప్-3 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో జరుగుతాయని ఆ తర్వాతే గ్రూప్-2 పరీక్ష పెడితే ప్రిపరేషన్‌కు అనువుగా ఉంటుందనేది విద్యార్థుల వాదన. అయితే ఈ డిమాండ్లపై మోతీలాల్ నాయక్, అశోక్, బక్క జడ్సన్ వంటివారు నిరాహారదీక్ష కూడా చేశారు. వీరిని ఉద్దేశిస్తూ ఓ బహిరంగ సభలో రేవంత్ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. సదువురానోళ్లు, సన్నాసోళ్లు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక బీఆర్‌ఎస్(BRS), కోచింగ్ సెంటర్ల(Coaching Centers) మాయ ఉందని విమర్శించారు. ఒక్క పరీక్ష వాయిదా ఒక్క నెలపడితే ఒక్కో కోచింగ్ సెంటర్‌కు వందల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు.
రేవంత్(CM revanth reddy) వ్యాఖ్యలపై మరోసారి నిరుద్యోగులు మండిపడ్డారు. చలో ఢిల్లీ పేరుతో ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. హైదరాబాద్ రోడ్లపై నిరసనలు తెలిపారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులతో డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చించిన తర్వాత పరీక్ష వాయిదా వేయాలన్న నిర్ణయానికైతే వచ్చారు. కానీ గతంలో పరీక్ష వాయిదా పడితే కోచింగ్ సెంటర్లకు వందల కోట్ల లాభమన్న రేవంత్ వ్యాఖ్యలతో దీనిని పోలుస్తున్నారు. ఏ కోచింగ్ సెంటర్ ఎంతిస్తే ఇప్పుడు వాయిదా వేస్తున్నారని కొందరు మండి పడుతున్నారు. సీఎం రేవంత్ వచ్చి తమ కోచింగ్ సెంటర్లకు ఎన్ని కోట్లు వస్తున్నాయో చూడాలని.. లేదంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.