టీపీసీసీ అధ్య‌క్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీ విష్ణునాథ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి.. మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ లు, ఎంపీ అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు.

టీపీసీసీ అధ్య‌క్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీ విష్ణునాథ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి.. మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ లు, ఎంపీ అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ మీటింగ్‌లో పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్, స్క్రూటినీ పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

కీలకమైన ఈ 11 రోజులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సీఎం సూచించారు. ప్రతీ మండల, బూత్ స్థాయిలో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని.. కష్టపడిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ లపై ఉందని.. ప్రతీ ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు.

120 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, పేదలకు చేకూరుతున్న లబ్దిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఆగస్టు 15 లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ ఆర్గనైజేషన్ కు సంబంధించిన సమస్యలుంటే దీపాదాస్ మున్షీ, ఇంచార్జ్ సెక్రటరీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ఎవరికి కేటాయించిన బాధ్యతలను వారు ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

ప్రజా ప్రభుత్వం అమలు చేసిన.. అమలు చేయబోయే పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించాలని భావించేవారు వీలైనంత త్వరగా వివరాలు ఇచ్చి.. కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. 11రోజులు ప్రణాళికను అమలు చేస్తూ.. గాంధీ భవన్ తో ఎపిప్పటికప్పుడు కో-ఆర్డినేట్ చేసేకోవాల‌న్నారు. క్షేత్రస్థాయిలో సీరియస్ గా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Updated On 29 April 2024 9:29 PM GMT
Yagnik

Yagnik

Next Story