తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఆయన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

CM Revanth to Visit Davos, London to Attract Investments From Jan 15 to 20
తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఆయన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ ఐదురోజులలో ఆయన దావోస్(Davos), లండన్(London)లలో పర్యటించనున్నారు. దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu), ఉన్నతాధికారులు దావోస్ కు వెళ్లనున్నారు. దావోస్ సదస్సులో భాగంగా ప్రముఖ ప్రపంచ కంపెనీలకు చెందిన సీఈవోలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
