సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండవ రోజు కొనసాగుతుంది. మొదటిరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి షెకావత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ పూరిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రాలు ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ(Delhi Tour) పర్యటన రెండవ రోజు కొనసాగుతుంది. మొదటిరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah), జలశక్తి శాఖ మంత్రి షెకావత్(Gajendra Singh Shekhawath), గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ పూరి(Hardeep Puri)ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రాలు ఇచ్చారు.
ఇవాళ యూపీఎస్సీ చైర్మెన్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) లు భేటి కానున్నారు. రాష్ట్రంలో టీఎస్పిఎస్సి(TSPSC)ని ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో యూపీఎస్సీ(UPSC) తరహాలో కొత్తగా కమిటి ఏర్పాటు ఆలోచనపై రేవంత్, ఉత్తమ్ లు చర్చించనున్నారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన మరో ₹ 1800 కోట్లు విడుదల చేయాలని సీఎం కోరనున్నారు.