తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ మాజీ సీఎం కేసీఆర్‌ను ప‌రామర్శించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న‌ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)ను ప‌రామర్శించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సోమాజిగూడ(Somajiguda)లోని యశోద ఆసుపత్రికి చేరుకోనున్నట్లు స‌మాచ‌రం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) యశోద ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్(Farm House) లోని బాత్రూమ్(Bathroom) లో కాలు జారి పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తుంటి ఎముక విరిగింది. ఆయనకు ఆపరేషన్(Operation) నిర్వహించిన వైద్యులు తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్ల(Steel Plates)ను అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఆరోగ్యంపై ఆసుప‌త్రి సిబ్బంది క్ర‌మం త‌ప్ప‌కుండా హెల్త్ బులిటెన్‌(Health Bulletin)లు విడుద‌ల చేస్తుంది.

Updated On 10 Dec 2023 12:55 AM GMT
Yagnik

Yagnik

Next Story