ఈ నెల 6న తెలంగాణ జనజాతర సభ నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తుక్కుగూడలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..
ఈ నెల 6న తెలంగాణ జనజాతర సభ నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తుక్కుగూడలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. 6వ తేదీన జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ వేదికగా విడుదల కాబోతోందని.. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకం అని తెలియజేశారు. తెలంగాణకు సోనియమ్మ కుటుంబం మరీ ప్రత్యేకం అన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు. సెప్టెంబర్ 17న 2023లో ఆరు గ్యారంటీలను సోనియమ్మ విడుదల చేశారని గుర్తుచేశారు. సోనియమ్మపై అభిమానంతో ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆరు గ్యారంటీలను మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.. మిగతా హామీలను ఎన్నికల కోడ్ తరువాత వందశాతం అమలు చేస్తామని తెలిపారు.
సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతామని.. ఇప్పుడు ఇదే వేదికగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసుకోబోతున్నాం.. జాతీయ కార్యాచరణ ఇక్కడి నుంచే పిలుపునివ్వడం అంటే మా కార్యకర్త కష్టాన్ని అధిష్టానం గుర్తించినట్లు అని కొనియాడారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు రాష్ట్రం నలుమూలల నుంచి జనజాతర సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో సభకు తరలి వచ్చి ఆశీర్వదించండని కోరారు.