Revanth Reddy : యశోదలో కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy). హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో(Yashoda Hospital) వైద్యుల పర్యవేక్షణలో ఉన్నకేసీఆర్ను పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం మంత్రి సీతక్క(Sitakka), సీనియర్ నేత షబ్బీర్ అలీతో(Shabir ali) కలిసి ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి..కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం కేసీఆర్ ఆరోగ్యం గురించి మాజీ మంత్రి కేటీఆర్, ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ‘‘కేసీఆర్‌ను పరామర్శించా.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించా... మా ప్రభుత్వ మంచి పాలన అందించడానికి ఆయన సూచనలు, సలహాలు అవసరం ఉంది. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి(Assembly) రావాలని ఆకాంక్షిస్తున్నా.. అని అన్నారు.
అంతకు ముందు రేవంత్ అక్కడే ఉన్న కేటీఆర్‌తో(KTR) సమావేశమయ్యారు. చికిత్స తీరు గురించి చర్చించారు. కేసీఆర్ ను పరామర్శించటానికి రావటం పైన రేవంత్ కు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. హిప్ రీప్లేస్ మెంట్ జరిగిందని..మరో మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని కేటీఆర్ వివరించారు. రెండు నెలలు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని చెప్పుకొచ్చారు.
కాగా, గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యులు శనివారం వాకర్ సాయంతో నెమ్మదిగా అడుగులు వేయించారు.