తెలంగాణ సచివాలయంలో(Telangana Secretariat) వాస్తు(vastu) మార్పులు జరుగుతున్నాయట! ఇలాగని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress) ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పాలన గాడిన పడలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి దశలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పువైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని వినియోగించారు.

తెలంగాణ సచివాలయంలో(Telangana Secretariat) వాస్తు(vastu) మార్పులు జరుగుతున్నాయట! ఇలాగని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress) ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పాలన గాడిన పడలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి దశలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పువైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని వినియోగించారు. వాస్తు మార్పుల్లో భాగంగా ఇకపై పశ్చిమం వైపు ఉన్న గేటు నుంచి లోపలికి వస్తారని, ఈశాన్యం వైపు ఉన్న గేటు ద్వారా బయటికి వెళుతున్నారని అంటున్నారు. ఈ రెండు గేట్లను ముఖ్యమంత్రి కోసం మాత్రమే వినియోగిస్తారని తెలిసింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు ఆగ్నేయం వైపు ఉన్న గేటు ద్వారా లోనికి వెళ్లాలని ఆదేశాలు జారీ అయినట్టు చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డికి ఇష్టమైన నంబర్‌ తొమ్మిది అని, సచివాలయంలోని తొమ్మిదవ అంతస్థులోకి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే పనులు జరుగుతున్నట్టు సమాచారం. అవి పూర్తి కాగానే సీఎంవో మొత్తం 9వ అంతస్థులోకి చేరుతుందని చెప్పుకుంటున్నారు.
వీటితోపాటు సచివాలయం లోపల మరికొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం. సీఎం కార్యాలయం మార్పు అనంతరం, మంత్రుల చాంబర్లలో కూడా వాస్తు మార్పులు చేయించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కొందరు మంత్రులు మార్పులు కావాలని కోరుతున్నట్టు చర్చ జరుగుతున్నది. మొత్తంగా రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి వాస్తు మార్పులు ఇవే కావడం గమనార్హం.

Updated On 3 Jun 2024 10:37 PM GMT
Ehatv

Ehatv

Next Story