తెలంగాణలో జిల్లాలపై పునఃసమీక్ష చేయాలని సీఎం రేవంత్‌(CM Revanth Reddy) నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 33 జిల్లాలను పెంచుతూ కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆయా జిల్లాల హెడ్‌ క్వార్టర్స్‌లో కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీస్‌లు, మెడికల్‌ కాలేజ్‌లు సహా పలు ప్రభుత్వశాఖలకు సంబంధించిన భవనాలు నిర్మించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో కూడా అనేక ఆందోళనలు జరిగాయి.

తెలంగాణలో జిల్లాలపై పునఃసమీక్ష చేయాలని సీఎం రేవంత్‌(CM Revanth Reddy) నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 33 జిల్లాలను పెంచుతూ కేసీఆర్‌(KCR) సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆయా జిల్లాల హెడ్‌ క్వార్టర్స్‌లో కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీస్‌లు, మెడికల్‌ కాలేజ్‌లు సహా పలు ప్రభుత్వశాఖలకు సంబంధించిన భవనాలు(Government buildings) నిర్మించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో కూడా అనేక ఆందోళనలు జరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ హేతుబద్దంగా లేదనే అభిప్రాయంతో రేవంత్‌రెడ్డి సర్కార్ ఉంది.

ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా సీఎం రేవంత్(CM Revanth) స్వయంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందన్న ఆయన.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయమై చర్చ పెడతామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ కమిటీ మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై(Districts divisons) నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని కోరతామని అన్నారు. ఒక జిల్లాలో మూడు, నాలుగు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి. జెడ్పీ సమావేశం నిర్వహిస్తే మొహాలు చూసుకోవడం తప్ప మరేమీ ఉండట్లేదు. ఒక ఎంపీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి.. అవి 3, 4 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు.

అయితే కొన్నిజిల్లాలు ఆయా జిల్లాల ప్రజల కోరిక మేరకు ఏర్పడ్డాయి. జిల్లాల విభజన ప్రక్రియ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు రోడ్లపైకి వచ్చి తమకు జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేపట్టారు. ఈ కోవాలోకే ములుగు, భూపాలపల్లి, గద్వాల, నారాయణపేటలాంటి జిల్లాలు ఉన్నాయి. ఒకవేళ వీటిని మళ్లీ పునర్విభజించి మరో జిల్లాలో ఈ ప్రాంతాలను కలిపితే మాత్రం ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజల్లో ఓ రకమైన ఆందోళనైతే నెలకొని ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా జిల్లాలను టచ్‌ చేస్తే పోరాటం తప్పదని హెచ్చరిస్తోంది.

Updated On 12 Jan 2024 6:02 AM GMT
Ehatv

Ehatv

Next Story