పార్లమెంట్ ఎన్నికలపై(Parliament Elections) కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీరియస్‎గా ఫోకస్ పెట్టింది. 12 లోక్‎సభ సీట్లు(Lok sabha Seats) గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ సాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలుకు కృషి చేస్తూనే..లోక్‌సభ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలుపెట్టింది.

పార్లమెంట్ ఎన్నికలపై(Parliament Elections) కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీరియస్‎గా ఫోకస్ పెట్టింది. 12 లోక్‎సభ సీట్లు(Lok sabha Seats) గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ సాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలుకు కృషి చేస్తూనే..లోక్‌సభ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌(Congress) నాలుగు అసెంబ్లీ సీట్లను సాధించినప్పటికీ, లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఖానాపూర్‌లోనే విజయం సాధించింది. ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు అనూహ్య విజయాన్ని రేవంత్‌ (CM Revanth)అన్ని సభల్లో చెబుతూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచే పార్లమెంటు ఎన్నికల రణభేరి మోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జీగా ఉన్న మంత్రి సీతక్క(Sitakka)..జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో దీనిపై చర్చించి, బహిరంగ సభపై ప్రకటన చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇంద్రవెల్లి సభ(Indravelli Sabha Publicmeet) తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ సమావేశాలు నిర్వహించిన తర్వాత..చివరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక..ఆరు గ్యారంటీల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలపై మంచి స్పందన లభించిందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇదే క్రమంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి.. గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సబ్సిడీపై ఏడాదికి ఎన్ని గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ఓ రోడ్‌మ్యాప్‌ తయారు చేసినట్లు సమాచారం. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకానికి సంబంధించి ఇప్పటికే ఇది అమలవుతున్న కర్ణాటకలో అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.

Updated On 29 Jan 2024 5:57 AM GMT
Ehatv

Ehatv

Next Story