తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా ఇంద్రవెల్లిలో(Indravelli) పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన ఇదే కావడం విశేషం. ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా ఇంద్రవెల్లిలో(Indravelli) పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన ఇదే కావడం విశేషం. ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(Free current), అయిదు వందల రూపాయలకే సిలిండర్ పథకాలను(LPG Subsidy) సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. మూడు పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్ల కరెంట్‌ను వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. అయితే, ఇంద్రవెల్లిని సీఎం రేవంత్‌రెడ్డి సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అప్పట్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9వ తేదీన ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు 'దళిత, గిరిజన దండోరా' పేరిట నిర్వహించిన సభకు లక్ష మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో రేవంత్‌ రెడ్డి ఇక వెనుదిరిగి చూసుకోలేదు.. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్‌ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక, దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్‌రెడ్డిగా సీఎం కావడం జరిగిపోయింది. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు..

Updated On 2 Feb 2024 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story