ఢిల్లీలో ప్రధానిని కలిసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో ప్రధానిని కలిసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రోరైలు విస్తరణ, ముసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డు, డ్రైపోర్టు వంటి పలు పెండింగ్ అంశాలకు నిధులు కేటాయించాలని కోరారు. ఆ తర్వాత కిషన్‌రెడ్డిపై ఆ బాధ్యతలు మోపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణకు నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని.. ఇప్పటికైనా నిధులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు పార్ట్‌నర్ అని.. కేసీఆర్‌ కోసమే కిషన్‌రెడ్డి పనిచేస్తారన్నారు. కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తామన్నారు. నాకు పేరు వస్తుందని మెట్రో విస్తరణను అడ్డుకున్నారని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ హయాంలో మెట్రో విస్తరణ జరగలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంజీవరెడ్డి, రాజాలింగం వంటి హత్యల వెనుక ఏదో మతలబుందన్నారు. కేటీఆర్‌కు కేదార్ పార్ట్‌నర్, డ్రగ్స్‌ కేసులో కేదార్ ఉన్నాడు. కేదార్ చనిపోతే కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదన్నారు. పదేళ్లు ఎస్‌ఎల్‌బీసీ పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు చేయకపోవడంతో మెషిన్ బేరింగులు పాడయ్యాయని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి తీరుతామని రేవంత్ అన్నారు.

ehatv

ehatv

Next Story