తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) శాసనసభ(assembly) వెలుపల కూడా సబితా ఇంద్రారెడ్డిపై(Sabitha indra Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) శాసనసభ(assembly) వెలుపల కూడా సబితా ఇంద్రారెడ్డిపై(Sabitha indra Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితా అని వ్యాఖ్యానించారు. తనకు సబితపై వ్యక్తిగత విరోధమేమీ లేదన్నారు. తాను సునీతా లక్ష్మారెడ్డి(sunitha lakshma reddy) ప్రచారానికి వెళితే తనపై రెండు కేసులు నమోదయ్యాయని, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని రేవంత్ అన్నారు. సునీతనేమో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయ్యారని, తనపైనేమో కేసులు ఉన్నాయని అన్నారు. తనను కాంగ్రెస్‌లోకి రమ్మన్నది సబితా ఇంద్రారెడ్డేనని, తాను మల్కాజ్‌గిరి లోక్‌సభకు నామినేషన్ వేసే సమయానికి ఆమె బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిందని చెప్పారు. సభలో తాము డెమోక్రటిక్‌గానే ఉంటామని, తమకంటే విపక్ష నేతలే ఎక్కవ సేపు మాట్లాడారని చెప్పారు. అతి చేస్తే స్పీకర్ శాసనసభ్యుల సభ్యత్వం కూడా రద్దు చేయవచ్చని, ఇంతకు ముందు కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి.