అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సి.ఎమ్.
తెలుగు సినీ ప్రముఖులు, మరియు ప్రభుత్వం మధ్య జరిగిన సమావేశంలో బన్నీ పై రేవంత్ రెడ్డి(CM Revanth reddy) మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి ఈ రోజు జరిగిన తెలుగు సినీ ఇండస్ట్రీ, తెలంగాణా సి.ఎమ్. సమావేశం పైనే ఉంది. దీనికి కారణం అల్లు అర్జున్(Allu arjun) అరెస్ట్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సంధ్య థియేటర్(Sandya theater) ఘటన పై ముఖ్యమంత్రి నేరుగా సినీ పరిశ్రమ వ్యక్తులతో ఎలా స్పందిస్తారు, అల్లు అర్జున్ గురించి ఏం మాట్లాడతారు అందరూ ఎదురుచూశారు.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ముఖ్య మంత్రి మాట్లాడుతూ.. అల్లు అర్జున్, రాం చరణ్ నాకు చిన్నప్పటి నుండీ తెలుసు. వారు నాతో కలిసి తిరిగారు. అర్జున్ పై నాకు ఎటువంటి కోపం లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం పక్కన పెడితే చట్ట ప్రకారం వ్యవహరించాను అని చెప్పారు. పరిధి ధాటి ఎవరు ప్రవర్తించిన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హీరోలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి సహకరించాలని చెప్పారు.