తెలంగాణ రాజకీయాల్లో హత్యలకు సంబంధించిన అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. కాళేశ్వరంపైన కేసులు వేసిన వాళ్లు వరుసగా చనిపోతున్నారని రేవంత్‌ అంటున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో హత్యలకు సంబంధించిన అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. కాళేశ్వరంపైన కేసులు వేసిన వాళ్లు వరుసగా చనిపోతున్నారని రేవంత్‌ అంటున్నారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సంజీవరెడ్డి అనే అడ్వొకేట్, రాజలింగమూర్తి అనే సామాజికవేత్త, కేదార్ అనే వ్యాపారవేత్త చనిపోయారు. సంజీవరెడ్డి చనిపోయి ఐదారు నెలలు అవుతుంది, ఆయన మరణంపై విచారణ నడుస్తోంది. రాజలింగమూర్తి హత్యలో స్థానిక బీఆర్‌ఎస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఉందని స్వయంగా రాజలింగమూర్తి కుటుంబసభ్యులే ఆరోపించారు. కేదార్ దుబాయ్‌లో తన గదిలో నిద్రపోతూ తెల్లారేసరికి శవంగా మారారు. కాళేశ్వరంపై కేసు వేసిన రాజలింగమూర్తి, డ్రగ్స్‌ కేసులో సంబంధమున్న కేదార్‌ కేటీఆర్‌కు సన్నిహితుడని వీరి చావులపై బీఆర్‌ఎస్, కేటీఆర్‌ ఎందుకు విచారణ కోరడం లేదనేది సీఎం రేవంత్‌ వాదన. అసలు రేవంత్‌రెడ్డి కోరుతున్న ప్రశ్న సహేతుకంగా ఉందా అనేది కాంగ్రెస్‌ నేతలు ఆలోచించాలి. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story