రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. మొదటి స్థానంలో సిద్దిపేట 61.37% బకాయిలు.. రెండో స్థానంలో గజ్వేల్ 50.29% బకాయిలు.. మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం బకాయిల‌తో ఉన్నాయ‌న్నారు.

రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. మొదటి స్థానంలో సిద్దిపేట 61.37% బకాయిలు.. రెండో స్థానంలో గజ్వేల్ 50.29% బకాయిలు.. మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం బకాయిల‌తో ఉన్నాయ‌న్నారు. సిద్దిపేటలో హరీష్ రావు(Harish Rao).. గజ్వేల్ లో కేసీఆర్(KCR).. హైదరాబాద్ సౌత్ లో అక్బరుద్దీన్.. బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలన్నారు.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడారు.. రైతులు రోడ్డెక్కారా అని జగదీష్ రెడ్డి అడిగారు.. కామారెడ్డిలో సెప్టెంబర్ 1 న సబ్ స్టేషన్ లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి ఆయనకు గుర్తుచేస్తున్నా.. సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది బీఆర్ఎస్ పాలనలోనేన‌ని గుర్తుచేశారు.

కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనేన‌ని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది మరణించారన్నారు. ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుందని గుర్తుచేశారు. కానీ ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదన్నారు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు.

అలాంటి వారితో స్నేహం ఎంఐఎం కు మంచిది కాదని అన్నారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు అని అన్నారు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం.. ఇప్పుడు విద్యుత్ రంగ శ్వేతపత్రంపై చర్చిద్దామ‌ని సూచించారు.

Updated On 21 Dec 2023 7:00 AM GMT
Ehatv

Ehatv

Next Story