పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి(BRS) వెళ్తారన్న వార్తలతో రేవంత్‌రెడ్డికి(Revanth reddy) భయం పట్టుకున్నట్లు ఉంది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి(BRS) వెళ్తారన్న వార్తలతో రేవంత్‌రెడ్డికి(Revanth reddy) భయం పట్టుకున్నట్లు ఉంది. రాత్రికి రాత్రి పోచారం ఇంటికి పరిగెత్తారు సీఎం రేవంత్‌రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పోచారం ఇంటికి వెళ్లి వాళ్లను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లొద్దని వేడుకుంటున్నారట. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారట. గులాబీ పార్టీ ఘర్‌ వాపసీలో వ్యూహంలో ఎమ్మెల్యేలు పడకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్‌లో(congress) చేరిన నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతారన్న వార్తలతో వారి డిమాండ్లు, 'అవసరాలు' తీరుస్తానని భరోసా ఇచ్చేందుకు హుటాహుటిన పోచారం ఇంటికి వెళ్లారని సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam srinivas reddy) ఇచ్చిన విందుకు రేవంత్‌ హాజరయ్యారు.

అయితే ఈ విందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి దీపదాస్‌ మున్షి(Deepadas munshi) కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(Bandla krishna mohan reddy) మినహా మిగతా సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ వారితో మాట్లాడుతూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తొందర పడ్డాడు.. మీరు మాత్రం పార్టీ మారకుండా ఉండాలని కోరారట. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌ క్యాడర్‌ తమకు మద్దతుగా నిలబడడం లేదని రేవంత్‌తో చెప్పి వాపోయారట. ఇకపై ఇలాంటివి జరగవని పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, పార్టీ క్యాడర్‌ను కూడా సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోరని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరగడమేంటని, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్‌రెడ్డి ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈరోజు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నంచేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉంటారని జూపల్లి చెప్పారు. ఇద్దరూ ఒకే వాహనంలో అసెంబ్లీకి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఈ దాగుడు మూతల వ్యవహారంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story