ఆమ్రపాలి(Amrapali).. తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడు ట్రెండింగ్ ఐఏఎస్‌గా(IAS) మారారు. వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా మూడేళ్లు పనిచేసిన ఆమ్రపాలి.. అక్కడ తనదైన శైలిలో వ్యవహరించారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటారు. పేరుకు తగ్గట్టే అందం కూడా ఉండడంతో ఆమ్రపాలికి తెలుగురాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్సు ఉన్నారు. యూత్‌లో ఆమెకు క్రేజ్ ఉంది. అమ్రాపాలి క్రేజ్‌కు ఉదాహరణ..
ఆమ్రపాలి(Amrapali).. తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడు ట్రెండింగ్ ఐఏఎస్‌గా(IAS) మారారు. వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా మూడేళ్లు పనిచేసిన ఆమ్రపాలి.. అక్కడ తనదైన శైలిలో వ్యవహరించారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటారు. పేరుకు తగ్గట్టే అందం కూడా ఉండడంతో ఆమ్రపాలికి తెలుగురాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్సు ఉన్నారు. యూత్‌లో ఆమెకు క్రేజ్ ఉంది. అమ్రాపాలి క్రేజ్‌కు ఉదాహరణ.. ఓ సారి గణేష్ నవరాత్రులలో ఆమ్రపాలి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆమో ఒడిలో బాలగణేష్‌ను ప్రతిష్టించారు. కేంద్ర సర్వీసుల్లో(Central Services) ఉన్న ఆమ్రపాలి.. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఆమెకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్(Metro Development) అథారిటీ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఓ రకంగా ఆమ్రపాలికి ప్రమోషన్(Promotion) వచ్చిందనే చెప్పాలి. వరంగల్ కలెక్టర్‌గా తనదైన ముద్ర వేసిన ఆమ్రపాలి.. హైదరాబాద్‌లో కూడా తన ప్రతిభను చూపుతారని అంటున్నారు.
దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో(Social Media) సెర్చ్ చేస్తున్నారు.
ఆమ్రపాలి తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎన్.అగ్రహారాం. తండ్రి కాటా వెంకటరెడ్డి, తల్లి పద్మావతి. తర్వాత ఉద్యోగం నిమిత్తం విశాఖపట్నం వెళ్లారు. వెంకటరెడ్డి ఆంధ్రాయూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పని చేశారు. వెంకటరెడ్డి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వెంకటరెడ్డి, పద్మావతి దంపతులకు ఈమె పెద్ద కూతురు. 1982 నవంబరు 4న విశాఖలో జన్మించిన ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పూర్తిచేశారు. 2010లో యూపీఎస్సీలో ఆల్ ఇండియా 39వ ర్యాంక్‌ను సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సమీర్‌శర్మను ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉత్తరభారతదేశానికి చెందిన సమీర్ 2011లో ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. ఆమ్రపాలి తెలుగమ్మాయి. వీరు కొన్ని రోజులు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి.. 2018 ఫిబ్రవరి 18న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్యలో సాధారణంగా వీరి వివాహం జరిగింది.