నగరంలో పలు అక్రమార్కుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది.
నగరంలో పలు అక్రమార్కుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్రమ నిర్మాణాలను కూస్తోంది. ఇప్పటికే పదుల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందకు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని తీసుకొచ్చారు. ఈ సంస్థను రద్దు చేయాలంటూ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ సంస్థపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్‌గా మారింది. దానం నాగేందర్‌పై(Dhanam nagendra) కూడా కేసు నమోదు కావడంతో ఏకంగా హైడ్రా(HYDRA) చీఫ్ రంగనాథ్‌పై(Ranganath) విమర్శలు చేశారు. ఇప్పటికే సుమారు 20 చెరువుల్లో ఆక్రమణలను తొలగించింది. అలాగే సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. ఇలా ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే తన ఉనికి చాటుకుందీ సంస్థ. జూబ్లీహిల్స్(Jubliee hills) లోని నందగిరి హిల్స్ లో 2వేల గజాల పార్కు స్థలంలో గురుబ్రహ్మ వాసులు గుడిసెలు నిర్మించుకున్నారు. వాటిని తొలగించిన హైడ్రా ప్రహరీగోడను నిర్మించింది. ఈ విషయం ఎమ్మెల్యే దానం నాగేందర్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయనతో పాటు మరికొందరు ప్రహరీ గోడను కూల్చేశారు. దాంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడం జరిగింది. ఈ విషయమై కమిషనర్ రంగనాథ్‌పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. సీఎంకు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు.
జన్వాడలో కేటీఆర్(KTR) ఫాంహౌజ్(Farm house)ఒకటి ఉందనే వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ ఫాంహౌజ్‌పై డ్రోన్ ఎగరవేయడం, అంతేకాకుండా దానిని పరామర్శించేందుకు గతంలో రేవంత్‌రెడ్డి(revanth reddy) వెళ్లి అరెస్టయిన విషయం తెల్సిందే. అయితే కేటీఆర్ ఫాంహౌజ్‌అని ప్రచారంలో ఉన్న ఆ ఫాంహౌజ్ కూడా 111 జీవో పరిధిలో ఉంది. 111జీవోకు విరుద్ధంగా ఈ ఫాంహౌజ్‌లో నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు కూడా చేశారు. ప్రభుత్వం మారింది, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా ఏర్పడడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఫాంహౌజ్‌పై బుల్డోజర్లు పంపించే యోచనలో రేవంత్‌రెడ్డి ఉన్నారట. అక్రమ నిర్మాణం చేపట్టారని ప్రజల్లో కేటీఆర్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. అందుకే దానం నాగేందర్ విషయంలో కూడా రేవంత్ వ్యూహాత్మకంగానే కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సొంత ఎమ్మెల్యే దానం పట్ల ఉదాసీనత ప్రదర్శించి కేటీఆర్ నిర్మాణాలను కూల్చివేస్తే గనుక విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఇయ్యకూడదనే వ్యూహాంలో భాగంగానే దానం విషయంలో కూడా వెనుకడుగు వేయలేదంటున్నారు. దానం విషయంలో రంగనాథ్‌కు అండగా నిలబడ్డారు. దానం నాగేందర్ భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతిపక్ష కేటీఆర్‌ను కొట్టాలనే రేవంత్ టార్గెట్ అట. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీష్‌రావు, మరికొందరు నేతల నుంచి విమర్శలు రేవంత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, వారినే టార్గెట్‌గా ఇలాంటి వ్యూహాలకు రేవంత్ పదునుపెడుతున్నారని సమాచారం. ప్రతిపక్ష పార్టీలో గట్టిగా మాట్లాడే కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, సబిత, కౌశిక్ వంటి నేతలను వ్యక్తిగత అటాక్ చేసి మానసికంగా దెబ్బకొట్టాలన్న ఎత్తుగడలా కనిపిస్తోంది. ఇక ఇదే వ్యూహాన్ని కేటీఆర్ ఫాంహౌజ్ పట్ల కూడా అమలుపర్చాలనేది ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెల్సింది. కేటీఆర్ ఫాంహౌజ్‌పైకి జేసీబీలను పంపించడంపై ఉత్కంఠ అయితే నెలకొంది.