తెలంగాణలో గత పదేళ్లుగా ఉన్న రియల్ ఎస్టేట్(Real estate) రంగం కాంగ్రెస్ ప్రభుత్వం(congress) వచ్చిన తర్వాత కాస్త స్తబ్దుగానే ఉంది.
తెలంగాణలో గత పదేళ్లుగా ఉన్న రియల్ ఎస్టేట్(Real estate) రంగం కాంగ్రెస్ ప్రభుత్వం(congress) వచ్చిన తర్వాత కాస్త స్తబ్దుగానే ఉంది. రియల్ రంగం దూకుడు తగ్గించిందనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందనే విషయం నిజం. రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తాయనే చెప్పాలి. బిల్డర్లు, వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫ్లోరింగ్ వేసేవారు, స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర, ఇటుక వ్యాపారస్తుల కుటుంబాలు రియల్ రంగంపై ఆధారపడి జీవిస్తాయి. ప్లాట్ల, ఫ్లాట్ల క్రయవిక్రయాల ద్వారా కూడా వేల మంది ఉపాధి పొందుతారు. హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో అయితే రియల్ రంగం దూసుకుపోతుందనడానికి ఆకాశమంత భవనాలే నిదర్శనం. కానీ సౌత్, ఈస్ట్ ప్రదేశాల్లో రియల్ రంగం కొంత నిరాశాజనకంగా ఉంది. ఏపీలో జగన్ ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు ప్రభుత్వం రావడం, అమరావతిలో రియల్ రంగం పరుగులు పెడుతుందన్న వార్తలతో ఇక్కడ స్తబ్దత ఏర్పడింది.
ఇందుకేనేమో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్(Secunderabad), సైబరాబాద్(Cyberabad) తరహాలో మరో నగరం నిర్మిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM revanth reddy) ప్రకటించారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ(Pharmacity) కోసం సేకరించిన భూముల విషయంలో చర్చ సందర్భంగా ముచ్చర్లను పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రీజినల్ రింగ్ రోడ్డు(Regional Ring Road), ఔటర్ రింగ్ రోడ్డు(Outter Ring Road) మధ్యలో ఉండే ముచ్చర్లలో 25 వేల ఎకరాల్లో పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం ద్వారా రవాణా సదుపాయాలు పెంచి ఇక్కడ రియల్ రంగాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డు కోసం కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు దిశగా అడుగులు వేస్తే మాత్రం హైదరాబాద్‌కు 50 కి.మీ.రేడియస్‌లో ఉన్న అన్ని పట్టణాల్లో రియల్ జోష్ అందుకోనుంది. అయితే సీఎం రేవంత్ సొంత గ్రామం శ్రీశైలం హైవే వైపు ఉండడంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆ ప్రాంతంలో పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారని రియల్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.