డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy) ఫాక్స్‌కాన్‌ కంపెనీకి(Foxconn Company) చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వి.లి.నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది.

డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో(Dr. B.R. Ambedkar Telangana Secretariat) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy) ఫాక్స్‌కాన్‌ కంపెనీకి(Foxconn Company) చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వి.లి.నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి(Industrial development) తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐటీ(IT), పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu), సీఎస్‌ శాంతకుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. అన్ని వర్గాలతో స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియచేసారు.

Updated On 26 Dec 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story