తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

CM Revanth Reddy is visiting Karnataka today
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుర్మిట్కల్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారసభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సేడంలో ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారసభలో పాల్గొంటారు.
ఇదిలావుంటే.. సీఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలోని కాంగ్రెస్ అభ్యర్ధుల పక్షాన ప్రచారం నిర్వహిస్తున్నారు. 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ కర్ణాటకలో ప్రచారం చేయగా.. నేడు మరోసారి వెళ్లనున్నారు.
