సినీ హీరో నాగార్జునకు(Nagarjuna akkineni) సంబంధించిన ఎన్‌-కన్వెన్షన్‌(N Convention) సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

సినీ హీరో నాగార్జునకు(Nagarjuna akkineni) సంబంధించిన ఎన్‌-కన్వెన్షన్‌(N Convention) సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ భద్రత మధ్య ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేశారు.. మాదాపూర్‌లోని తుమ్మిడిహడ్డి చెరువులో మూడు ఎకరాలు కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారనే ఆరోపణలను ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు(HYDRA) ఫిర్యాదు అందడంతో పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(Revanth reddy) మాట్లాడేందుకు నాగార్జున ప్రయత్నిస్తున్నారని సమాచారం! నాగార్జున ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించలేదని వినికిడి! తన కన్వెన్షన్‌ సెంటర్‌ను కాపాడుకోవడానికి నాగార్జన చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం చెందాయి. నాగార్జున రిక్వెస్ట్‌ను రేవంత్‌రెడ్డి అసలు ఖాతరు చేయలేదని తెలిసింది. నాగార్జునలాంటి సెలబ్రిటీ కన్వెన్షన్‌ను కూల్చి వేడయంతో ఇతరులకు ఒక హెచ్చరిక పంపినట్టు అవుతుందని ప్రభుత్వం భావించింది. చెరువులో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా విడిచిపెట్టేది లేదని హైడ్రా అధికారులు చెబుతున్నారు. అన్నట్టుగానే చేస్తున్నారు. సీఆర్ స‌ర్కార్ దాదాపు ప‌దేళ్లు పాల‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను కూల్చ‌లేక‌పోయింది. కానీ రేవంత్ స‌ర్కార్ మాత్రం ఏడు నెల‌ల్లోనే ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను కూల్చేయ‌డం చర్చనీయాంశమయ్యింది.

Eha Tv

Eha Tv

Next Story