ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో, మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతోంది.

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో, మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ టూర్‌లో క్లారిటీ వస్తుంది అంటున్న కాంగ్రెస్ నేతలు. ఆశావహుల్లో ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మదన్‌మోహన్‌రావు, వాకాటి శ్రీహరి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్‌సాగర్ రావు, సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్‌లు. మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో వలస నేతలు కూడా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం, కడియం, దానం నాగేందర్‌ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉండగా కేబినెట్‌లో మరో ఆరుగురికి చోటు దక్కనుంది.



ehatv

ehatv

Next Story