రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ప్రకటించారు.
రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల రైతు భరోసా(Rythu Bharosa)పై ఈ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసాపై ప్రభుత్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని అన్నారు. కేసీఆర్(KCR) ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు రూ.80 వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. గతంలో సాగుచేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు. ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్-2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే సభ ముందుకు తెలంగాణ మున్సిపాలిటీల 2024 బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు 2024ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ భూ భారతి(Bhu Bharati) బిల్లును మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రైతు భరోసాపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.