కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి ఉద్యోగం దక్కించుకున్న ఓ దివ్యాంగ మహిళ. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తూమరి రజని అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రం అందించారు.హైదరాబాద్‌ నాంపల్లి దగ్గరలోని బోయిగూడకు చెందిన రజని లయోలా స్కూల్, వనితా కాలేజీల్లో చదువుకుంది. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి ఉద్యోగం దక్కించుకున్న ఓ దివ్యాంగ మహిళ. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తూమరి రజని అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రం అందించారు.హైదరాబాద్‌ నాంపల్లి దగ్గరలోని బోయిగూడకు చెందిన రజని లయోలా స్కూల్, వనితా కాలేజీల్లో చదువుకుంది. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు. అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ ప్రచారం సమయంలో గాంధీ భవన్‌లో రేవంత్‌రెడ్డిని ఆమె కలిసి తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వడం లేదని మొరపెట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా మొదటి ఉద్యోగం ఆమెకే ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆమె పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు రాసుకుని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పత్రంపై రేవంత్ రెడ్డి సంతకం చేసి ఆమెకు అందించారు.
ఇచ్చిన మాట ప్రకారం, పార్టీ గెలిచిన తరువాత ప్రమాణ స్వీకారోత్సవానికి రజనిని రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఆమెకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు తీసుకురావల్సిందిగా దివ్యాంగుల సంక్షేమశాఖను ఆదేశించారు. రజనీకి తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్‌గా కాంట్రాక్ట్ పద్దతిన ఉద్యోగం కల్పించారు. రజనీకి నెలకు రూ.50,000 జీతం అందుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated On 8 Dec 2023 5:27 AM GMT
Ehatv

Ehatv

Next Story