ఈ ఎన్నికల్లో మోసానికి, విశ్వాసానికి పోటీ జ‌రుగుతుంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ కార్నర్ మీటింగ్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో నమ్మకానికి, నమ్మక ద్రోహానికి పోటీ.. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి పోటీ జ‌రుగుంద‌ని అన్నారు

ఈ ఎన్నికల్లో మోసానికి, విశ్వాసానికి పోటీ జ‌రుగుతుంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ కార్నర్ మీటింగ్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో నమ్మకానికి, నమ్మక ద్రోహానికి పోటీ.. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి పోటీ జ‌రుగుంద‌ని అన్నారు.

విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోదీ మోసం చేశారన్నారు. బీజేపీ నుంచి కొండను బరిలోకి దించామని వాళ్లు మాట్లాడుతున్నారు.. అది కొండైనా.. బండైనా.. మా కార్యకర్తలు పిండి పిండి చేస్తారన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ మనకు పది పైసలు ఇవ్వలేదన్నారు. మరి ఇవాళ ఓట్లు ఎలా అడుగుతారు? అని ప్ర‌శ్నించారు.

అయోధ్య రాముడి ప్రతిష్టకు 15 రోజుల ముందే బీజేపీ నేతలు తలంబ్రాలు పంచారని.. రేషన్ బియ్యంలో పసుపు కలిపి మన ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని.. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని విమ‌ర్శించారు. పదేళ్లు బీజేపీ మోసం చూశారు.. బీఆర్ఎస్ దోపిడీ చూశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు మనల్ని మోసం చేయడానికే వస్తారన్నారు.

కారు కార్ఖానాకు పోయింది.. ఇక సరాసరి తూకానికే.. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కిండు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందన్నారు. వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించండని పిలుపునిచ్చారు.

ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. డిసెంబర్ లో జరిగినవి సెమీ ఫైనల్స్ మాత్రమే.. మే 13న ఫైనల్స్ జరగబోతున్నాయి..మే 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్.. గుజరాత్ టీమ్ వైపు మోదీ.. తెలంగాణ టీమ్ వైపు మీ రేవంతన్న ఉన్నాడు.. గుజరాత్ ను డక్ ఔట్ చేసి తెలంగాణ టీమ్ ను గెలిపించండని పిలుపునిచ్చారు.

Updated On 5 May 2024 8:47 PM GMT
Yagnik

Yagnik

Next Story