తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) శాసనసభలోనే(Assembly) ఏమాత్రం సంకోచపడకుండా అబద్ధాలాడేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) శాసనసభలోనే(Assembly) ఏమాత్రం సంకోచపడకుండా అబద్ధాలాడేస్తున్నారు. తాను చెప్పిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్‌ను(KCR) ఒక విలన్‌గా చూపించాలని ఆరాటపడుతున్నారు. ఆ ఆరాటంలో తప్పటడుగులు వేస్తున్నారు. కొన్నిరోజులైతే 1908లో హైదరాబాద్‌కు వచ్చిన వరదకు కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమనేట్టుగా ఉన్నారు. గృహ విద్యుత్(ELectricity) వినియోగానికి స్మార్ట్ మీటర్లు పెట్టాలనే అంశం విషయానికే వద్దాం. ఇక్కడే రేవంత్ బొక్కబోర్లా పడ్డారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన మోసం, దగా, కుట్ర అంటూ ఏదేదో చెప్పారు. కేసీఆర్ చేసుకున్న దుర్మార్గపు ఒప్పందాల కారణంగా విద్యుత్ సంస్థల మెడపై కత్తి వేలాడుతున్నదని అన్నారు. విధిలేని పరిస్థితులలో స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందంటూ రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడికేదో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రైతులకే ఎన్నో మేళ్లు చేసినట్టుగా బిల్డప్ కూడా ఇచ్చారు. కేసీఆర్ చేసిన ద్రోహం కారణంగానే బావుల దగ్గర స్మార్ట్ మీటర్లు(smart meters) పెట్టాల్సి వస్తున్నదని, రైతులు వినియోగించే కరెంట్‌ను లెక్కించిక తప్పదని చెప్పారు. మోదీ సమక్షంలో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం ఇదిగోనంటూ ఓ పేపర్ చూపించారు. దాన్ని అసెంబ్లీలో చదివి వినిపించారు. అంతా విన్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఇలా చేశారా అని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఏమీ చేయలేదు. ఉదయ్ స్కీమ్‌లో భాగంగా చేసుకున్న ఒప్పందాన్ని చూపించి ముఖ్యమంత్రి శాసనసభను తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పడంతో రేవంత్ ఝూటా మాట తెలిసిపోయింది. సోమవారం అసెంబ్లీ సమావేశాలలో ఈ సారి జగదీశ్‌రెడ్డి(Jagadish reddy) లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు. సభను ముఖ్యమంత్రి ఎలా తప్పుదో వ పట్టించారో సాక్ష్యాలతో సహా వివరించారు. ఉదయ్ స్కీమ్‌లో భాగంగా అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని చూపించి బావుల దగ్గర మోటార్లకు మీటర్లకు పెట్టాలన్నట్టుగా సీఎం చెప్పుకొచ్చారని, ఇది అబద్ధం కాబట్టి రికార్డులు సరి చేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇన్‌స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దేన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ ఎబవ్ 500 యూనిట్స్/మంథ్ బై 31 డిసెంబర్ 2018 అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ ఎబవ్ 200 యూనిట్స్ / మంథ్ బై 31 డిసెంబర్ 2019'' అని ఉదయ్ అగ్రిమెంట్ లో ఉంటే ముఖ్యమంత్రి అదర్ దేన్ అగ్రికల్చర్ అనే పదాలను సీఎం కావాలనే చదవకుండా సభను తప్పుదారి పట్టించారని చెపారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో 0.5 శాతం అదనంగా అప్పులు తీసుకునే సదుపాయం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది కరోనా లాక్ డౌన్ తర్వాత. అంతకన్నా ఎన్నో ఏళ్ల ముందే చేసుకున్న ఉదయ్ స్కీం అగ్రిమెంట్ తో సభను తప్పుదారి పట్టించాలని చూసి అడ్డంగా బుక్కయ్యారు. తమ ప్రభుత్వం వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెట్టాలని చూడటం లేదని ఇప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. ఇంకో చిత్రమేమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ కు 24 గంటల కరెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట! ఈ మాటన్నది రేవంత్‌రెడ్డేనని వేరే చెప్పనక్కర్లదనుకుంటా! అలాగే రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా రంగాలతో పాటు హైదరాబాద్ నగానికి 24 గంటలు కరెంట్ సరఫరా చేశారని నిండు సభలో రేవంత్ చెప్పడంతో హైదరాబాద్ వాసులు నవ్వకున్నారు. 2014కు ముందు హైదరాబాద్ లోనూ పవర్ కట్స్ ఎలా ఉండేవో ప్రతి ఒక్కరికి తెలుసు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండేవి. కరెంట్ భారాన్ని తప్పించుకునేందుకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే తప్పనిసరి అని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అయితే వాటిని వ్యతిరేకిస్తూ ఇండస్ట్రియలిస్టులు ధర్నాచౌక్ లో ఆందోళన చేసిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ బొక్క పెద్దది చేస్తున్నప్పుడు నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లాకు ఇన్‌చార్జీ మంత్రిగా ఉన్నారని మరో అబద్ధమాడారు రేవంత్‌రెడ్డి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు వైఎస్ ప్రయత్నించడానికి చాన్నళ్లకు ముందే అప్పట్లో టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు మంత్రులు రాజశేఖర్ రెడ్డి కేబినెట్ నుంచి తెలంగాణ సాధన కోసం తప్పుకున్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని శాసనసభ సమావేశాలు సాగినన్ని రోజులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేశారు. .