ప్రమాణస్వీకారం తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్‎రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ(Delhi) వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రుల శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించి..క్లారిటీ తీకునే అవకాశం ఉంది. అలాగే ఖాళీగా ఉన్న మరో ఆరుగురు మంత్రుల వివరాలపై స్పష్టత తీసుకోనున్నారు.

ప్రమాణస్వీకారం తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్‎రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ(Delhi) వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రుల శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించి..క్లారిటీ తీకునే అవకాశం ఉంది. అలాగే ఖాళీగా ఉన్న మరో ఆరుగురు మంత్రుల వివరాలపై స్పష్టత తీసుకోనున్నారు. రేపటి నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో..రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్‎రెడ్డి.

డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డితోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపులపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అధిష్టానం నుంచి క్లారిటీ లేకపోవడంతో శాఖల కేటాయింపులో ఆలస్యం అయ్యింది. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టత కోసం సీఎం హోదాలో రేవంత్‎రెడ్డి తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ సాయంత్రానికి అధికారికంగా మంత్రులకు శాఖల కేటాయింపు జరగనుంది.

సీఎం రేవంత్ రెడ్డి..మంత్రి వర్గంలోకి కేవలం 11 మందిని మాత్రమే తీసుకున్నారు. కేబినెట్‎లో మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఆరు బెర్తులకు ముందుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఇబ్రహీంపట్నం నుంచి మల్‎రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి అంజన్ కుమార్, ఫిరోజ్ ఖాన్, మధుయాష్కి, షబ్బీర్ అలీ, భోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే చీఫ్ విప్ తోపాటు రెండు విప్ పదవులపై కూడా క్లారిటీ రానుంది.

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎కు కేబినెట్‎లో మొదటి దఫాలో చోటు దక్కలేదు. నగరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు కూడా గెలవకపోవడతో మంత్రివర్గంలో చోటు లేకుండాపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి ఒకరికి కేబినెట్ లో స్థానం కల్పించాలన్న యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అతిపెద్ద యాదవ సామాజిక వర్గమైన యాదవులకు కేబినెట్‎లో స్థానం దక్కలేదు. దీంతో సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‎కు కేబినెట్‎లో అవకాశం కల్పించాలని అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రేపు ఉదయం 8:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉంది. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. అలాగే ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్‎రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు.

Updated On 8 Dec 2023 4:46 AM GMT
Ehatv

Ehatv

Next Story