అసెంబ్లీ(Assembly) సమావేశాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీ మంత్రి కేటీఆర్‌ల(KTR) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తొలుత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితను ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చింది విలక్షణ తీర్పు అని అన్నారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని విమర్శించారు.
అసెంబ్లీ(Assembly) సమావేశాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీ మంత్రి కేటీఆర్‌ల(KTR) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తొలుత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితను ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చింది విలక్షణ తీర్పు అని అన్నారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్(BRS) సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని.. వాళ్లు ఇలానే ఉంటే వారిని ఎక్కడికి పంపించాలో ప్రజలకు తెలుసునని అన్నారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నా... వారిని బీఆర్ఎస్ పట్టించుకోలేదని.. కొడుకు, అల్లుడు, కూతురుకు మాత్రమే పదవులు కట్టబెట్టారన్నారు. అందుకే ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు.
గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే.. బీఆర్‌ఎస్ నేతలు భరించలేకపోతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రగతిభవన్‌లోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రగతిభవన్ ముందు గద్దర్ గంటల తరబడి నిరీక్షించినా లోనికి అనుమతించలేదన్నారు. మేం వచ్చిన వెంటనే ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టాం.. ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం.. మాది ప్రజా ప్రభుత్వం.. పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు ప్రగతి భవన్‌లోకి ప్రవేశం కల్పించలేదని బీజేపీ(BJP) నేత ఈటల రాజేందర్(Etala Rajendra) ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
అంతుకుముందు మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్‌లోనే మెగా డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని మీద అతిగతి లేదు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ 40 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. మేం చేసిన దాని కంటే బ్రహ్మాండంగా చేసుకోండన్నారు. ఓట్ల కోసం బస్సులు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. గత పదేండ్లలో రక్తాన్ని రంగరించినం.. మెదళ్లను కరిగించినం.. ప్రాణం పెట్టి పని చేసినం కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో తెలంగాణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.