మొన్న అల్వీన్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఆరు మంది కార్మికులను తాడు సాయంతో కాపాడిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అభినందించారు

CM Revanth Reddy congratulated Saicharan
మొన్న అల్వీన్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఆరు మంది కార్మికులను తాడు సాయంతో కాపాడిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అభినందించారు. ఈ నెల 26న నందిగామ శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి సాయిచరణ్ ఆరుగురిని కాపాడాడు.ఆ సమయంలో పోలీసులు కూడా సాయిచరణ్ సాహాసాన్ని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన 15 ఏళ్ల సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. సాయిచరణ్ సాహసాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.. భవిష్యత్‌లోనూ ఆపదలో ఉన్న వారికి సాయసహాకారాలను అందించాలని సూచించారు.
