ప్రజా ఆమోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే రెండు గ్యారెంటీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సెక్రటేరియట్‌లో ప్రజాపాలన లోగో, దరఖాస్తు ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుందన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ప్రజా పాలన దరఖాస్తులు తీసుకుంటామన్నారు.

నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజాభవన్ కు వచ్చి ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారని.. గత పదేళ్లుగా ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే.. గడీల నుంచి పాలనను గ్రామాలకు చేర్చాలని.. అందుకే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.
ప్రతీ సంక్షేమ పథకం ప్రజలకు అందేలా చూసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో దరఖాస్తు స్వీకరణకు కౌంటర్లు పెంచుతున్నామన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ కూడా దరఖాస్తులు స్వీకరించే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఎనిమిది రోజుల తరువాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. గడువు తరువాత ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఈ ప్రభుత్వం ప్రజలది.. ప్రజల కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. రేషన్ కార్డులు లేని వారి దరఖాస్తులూ స్వీకరిస్తామని.. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. గ్రామ సభల్లో అన్ని రకాల దరఖాస్తులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
కేటీఆర్(KTR) కు కౌంటర్
ప్రజావాణిలో న్యాయం జరగలేదని ఓ మహిళకు కేటీఆర్ లక్ష రూపాయలు అందించారని ప్రచారం చేసుకుంటున్నారు. మహిళకు కేటీఆర్ తో లక్ష రూపాయలు ఇప్పించడంలో ప్రజావాణి విజయవంతమైందని అన్నారు. దోచుకున్న లక్ష కోట్లల్లో లక్ష రూపాయలే కేటీఆర్ పంచారని.. ఖచ్చితంగా మిగతా డబ్బులు ప్రజలకు పంచేలా చేస్తామన్నారు. వాళ్లవి ప్రజల రక్తం పిండి సంపాదించిన ఆస్తులు అని కామెంట్ చేశారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారు.. అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు. ఐటీఐఆర్ వెనక్కు వెళితే అడగని వినోద్ కుమార్.. సైనిక్ స్కూల్ గురించి అడగని ఆయన..బుల్లెట్ ట్రైన్ గురించి మాకు నీతులు చెబుతారా? అని ప్రశ్నించారు.