ఎన్నికల కోడ్(Election Code) వచ్చిందని, ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని, ముందు ముందు ఇంకా రాజకీయం చూపిస్తానని సీఎం రేవంత్(CM revanth reddy) అన్నారు. ఇప్పటికైతే ఒక గేటు మాత్రమే ఓపెన్ చేశామని కీలక వ్యాఖ్య లు చేశారు సీఎం రేవంత్.

CM revanth Reddy
ఎన్నికల కోడ్(Election Code) వచ్చిందని, ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని, ముందు ముందు ఇంకా రాజకీయం చూపిస్తానని సీఎం రేవంత్(CM revanth reddy) అన్నారు. ఇప్పటికైతే ఒక గేటు మాత్రమే ఓపెన్ చేశామని కీలక వ్యాఖ్య లు చేశారు సీఎం రేవంత్. మొత్తం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్ ఖాళీ కావడం ఖాయమని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక ముందు ముందు ఎవరెవరు చేరుతారో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. విపక్ష పార్టీలో ఎవరూ లేనప్పుడు గేట్లు తెరిచినా మూసినా ఒక్కటే అన్నారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంభించిన కేసీఆర్‌కు బుద్ధి చె ప్పిందన్నారు. వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని, ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అన్నారు సీఎం రేవంత్
