అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను అధ్య‌క్షుడు ఖర్గే, ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను అధ్య‌క్షుడు ఖర్గే(Mallikarjuna Kharge), ఏఐసీసీ(AICC)కి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లోక్ సభ(Loksabha) లో పోటీకి అభ్య‌ర్ధుల నుంచి కాంగ్రెస్ పార్టీ)Congress Party) దరఖాస్తులను ఆహ్వానిస్తోందని తెలిపారు. మార్చి 3 వ‌ర‌కూ ధరఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని.. అప్లికేష‌న్ల స్క్రూటినీ కోసం ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని వెల్ల‌డించారు. 17 పార్లమెంట్ సెగ్మెంట్ లకు మంత్రులను, ఇంచార్జీ లను నియమించామని వెల్ల‌డించారు. దేశ ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ(PM Modi) విఫలం అయ్యారని.. ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంగా ఇండియా అవ్వడం మోదీ ఘనతేన‌ని దుయ్య‌బ‌ట్టారు.

రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని అన్నారు. కేసీఆర్(KCR) ను ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యే లను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ(BJP) ఘనత సాధించిందన్నారు. దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పులు మోపారని అన్నారు. మణిపూర్ లో అంతటి సింహ ఘటన జరిగితే మోదీ అక్కడికి వెళ్ళలేదన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) లాంటి నాయకుడు దేశానికి ప్రధాని అవ్వడం అవసరమ‌న్నారు.

తెలంగాణ(Telangana)లో BRS పార్టీ సచ్చింది.. మనుగడ లేదన్నారు. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారింది.. బీజేపీ BRS ఒక్కటైందన్నారు. బిల్లా - రంగా అన్నట్లు BJP - BRS వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. BRS కు ఓటు వేస్తే మూసిలో వేసినట్లేన‌న్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ హామీలు తెలంగాణలో హామీలు అమలు జరుగుతాయన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు జరగాలి అంటే 17 లోక్ సభ సీట్లు గెలవాలన్నారు.

మోదీతో కేసీఆర్ చీకటి చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లి(Indravelli) సభ నుంచి లోక్ సభ శంఖారావం పూరిస్తున్నామ‌ని తెలిపారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఒకటే అంటే వాళ్ళ మాటలు పిచ్చి మాటలేన‌న్నారు. రాజకీయ కుట్రతోనే ప్రమాణ స్వీకారం వాయిదా వేసి కుట్రకు తెరలేపారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రాబోయే ఎన్నికల బరిలో ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసాము.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నామ‌న్నారు. ఎమ్మెల్యే లు ఎవరు అడిగినా అపాయింట్మెంట్ ఇస్తాను. కేటీఆర్(KTR), కేసీఆర్, హరీష్ రావు(Harish Rao) లకు కూడా సమయం ఇస్తాన‌న్నారు.

బడ్జెట్ లో హామీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. ఇరిగేషన్ శాఖ పై వచ్చే అసెంబ్లీ సమావేశంలో శ్వేత పత్రం విడుదల చేస్తామ‌ని తెలిపారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ మొదలు అయిందన్నారు. గద్దర్(Gaddar) జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంద‌ని వెల్ల‌డించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చట్ట ప్రకారం విచారణ మొదలైంద‌న్నారు.

Updated On 30 Jan 2024 8:26 PM GMT
Yagnik

Yagnik

Next Story