సీఎం రేవంత్‌రెడ్డి(Revanth reddy) సుప్రీంకోర్టుకు(Supreme court) క్షమాపణ(Apology) చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి(Revanth reddy) సుప్రీంకోర్టుకు(Supreme court) క్షమాపణ(Apology) చెప్పారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఆగస్టు 29న కొన్ని మీడియా వేదికల్లో తాను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు.. కోర్టులను ప్రశ్నిస్తున్నాననే అర్థంలో ధ్వనించాయని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తల పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టు చేశారు. ఇంతకీ సీఎం క్షమాపణలకు కారణమేంటంటే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడం. ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న జగదీష్‌రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కవిత్ బెయిల్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని నిందితులకు మేము బెయిల్ ఇస్తామా అంటూ.. రేవంత్ రెడ్డి తరపు లాయర్లను జస్టిస్ గవాయితో కూడిన తిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం, అపారమైన గౌరవం ఉందన్నారు. తన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియపై తనకు విశ్వాసం ఉందన్నారు. న్యాయవ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా తనకు అత్యంత నమ్మకం ఉందని సీఎం రేవంత్ తెలిపారు.