నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో పట్టపగలు ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన అమానవీయ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణమే బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉట్కూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ బిజ్జ శ్రీనివాసులును జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబీకులు సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాణం పోయిందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.


Eha Tv

Eha Tv

Next Story