విన్నారుల్లా ఈ ముచ్చట! ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(CM KCR) మాజీ ఎంపీ వివేక్‌(Ex-MP Vivek) కోటి రూపాయలు అప్పు(Debt) ఇచ్చారట! ఈ విషయం ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అఫిడవిట్‌(Affidavit) దాఖలు చేయాలి కదా! అందులో ఆస్తిపాస్తుల(assets) వివరాలు చెప్పాలి కదా! అదిగో.

విన్నారుల్లా ఈ ముచ్చట! ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(CM KCR) మాజీ ఎంపీ వివేక్‌(Ex-MP Vivek) కోటి రూపాయలు అప్పు(Debt) ఇచ్చారట! ఈ విషయం ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అఫిడవిట్‌(Affidavit) దాఖలు చేయాలి కదా! అందులో ఆస్తిపాస్తుల(assets) వివరాలు చెప్పాలి కదా! అదిగో.. అలా చెబుతున్నప్పుడు అప్పు ముచ్చట కూడా చెప్పారాయన! మంచిర్యాల జిల్లా చెన్నూరు(chennuru) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వివేక్‌ ఒక్క సీఎం కేసీఆర్‌కే కాదు, రామలింగారెడ్డికి(Ramalinga Reddy) పది లక్షల రూపాయలు, కాంగ్రెస్‌(congress) నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి(Komatireddy Rajgopal Reddy) కోటిన్నర అప్పుగా ఇచ్చారట! మొత్తం 23.99 కోట్ల రూపాయలను వ్యక్తిగత అప్పులుగా ఇచ్చినట్టు అఫడవిట్‌లో వివేక్‌ తెలిపారు. ఆయనకు 600 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ విషయంలో వివేక్‌ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులు ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో 377 కోట్ల రూపాయలు ఉన్నాయి. విశాఖ కంపెనీతో పాటు పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్టు వివేక్‌ తెలిపారు. వివేక్‌ తర్వాత ప్లేసు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి దక్కుతుంది. పాలేరు స్థానానికి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న ఈ మాజీ ఎంపీకి 460 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌(BRS) అధినేత, సీఎం కేసీఆర్‌ తన అఫిడవిట్‌లో తన కుటుంబ ఆస్తులు 59 కోట్ల రూపాయలు అని చెప్పుకున్నారు. ఆయనకు సొంత కారు కూడా లేదట! అయితే తాను మాజీ ఎంపీ వివేక్‌కు 1.06 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.

Updated On 14 Nov 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story