ఫిబ్రవరి 5న తొలిసారి పొరుగు రాష్ట్రంలో కెసిఆర్ బహిరంగ సభ. చురుగ్గా సభ ఏర్పాట్లు. భారీ జన సమీకరణకు నాయకుల ప్రచారం. కొంతమంది నాయకులు పార్టీలో చేరే అవకాశం. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. అదే నూతన ఉత్తేజంతో మహారాష్ట్రలోని నాందేడ్ లో ఫిబ్రవరి 5న భారీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న నాందేడ్ ప్రాంతంలో తెలుగు మాట్లాడే […]
ఫిబ్రవరి 5న తొలిసారి పొరుగు రాష్ట్రంలో కెసిఆర్ బహిరంగ సభ. చురుగ్గా సభ ఏర్పాట్లు. భారీ జన సమీకరణకు నాయకుల ప్రచారం. కొంతమంది నాయకులు పార్టీలో చేరే అవకాశం.
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. అదే నూతన ఉత్తేజంతో మహారాష్ట్రలోని నాందేడ్ లో ఫిబ్రవరి 5న భారీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న నాందేడ్ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో ఉండడంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు
ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కొద్దికాలంగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు.
దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనేది నినాదంతో పురుడు
పోసుకున్న భారత రాష్ట్ర సమితి కెసిఆర్ సారధ్యంలో దూసుకుపోతుంది. గత కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలకు బిఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలు కోరుకుంటున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు అందుకే ఇటీవలే చాలామంది రాజకీయ నేతలు, మేధావులు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు ఎంతోమంది కెసిఆర్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పార్టీ ముఖ్య నాయకులు ప్రకటించారు.