జూలై 31న సచివాలయంలో రాష్ట్ర కేబినెట్(state Cabinate) సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ఈ సమావేశంలో దాదాపు 40 నుంచి 50 అంశాల మీదమంత్రివర్గం చర్చించనున్నది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు(Floods), ప్రభుత్వ చర్యలపై కేబినెట్ భేటీలో సమీక్షించనున్నది.

Cabinet Meeting
జూలై 31న సచివాలయంలో రాష్ట్ర కేబినెట్(state Cabinate) సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ఈ సమావేశంలో దాదాపు 40 నుంచి 50 అంశాల మీదమంత్రివర్గం చర్చించనున్నది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు(Floods), ప్రభుత్వ చర్యలపై కేబినెట్ భేటీలో సమీక్షించనున్నది. రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినేట్ చర్చించనున్నది.
రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా(Transport routes) మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కూడా కేబినెట్ చర్చించనున్నది. ఈ భేటీలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులకు(RTC Employees) జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కూడా ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 3 నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
