'సిట్టింగ్‌లెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందరికీ టికెట్లు దొరుకుతాయి. జాగ్రత్తగా పని చేసుకోండి. ప్రజలతో మమేకం అవ్వండి' ఇది బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కొన్ని రోజుల కిందట చెప్పిన మాట! వారం కిందట జరిగిన బీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో మాత్రం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జాగ్రత్తగా పని చేసుకోవాలన్నారు. పని చేయని ఎమ్మెల్యేల తోకలు కట్‌ చేస్తానని హెచ్చరించారు.

'సిట్టింగ్‌లెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందరికీ టికెట్లు దొరుకుతాయి. జాగ్రత్తగా పని చేసుకోండి. ప్రజలతో మమేకం అవ్వండి' ఇది బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కొన్ని రోజుల కిందట చెప్పిన మాట! వారం కిందట జరిగిన బీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో మాత్రం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జాగ్రత్తగా పని చేసుకోవాలన్నారు. పని చేయని ఎమ్మెల్యేల తోకలు కట్‌ చేస్తానని హెచ్చరించారు. అధినేత నుంచి వచ్చిన వార్నింగ్‌ తర్వాత సిట్టింగ్‌లలో గుబులు పుట్టింది. తెలంగాణ భవన్ ప్రారంభోత్సం కోసం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌ అక్కడి నుంచి రాగానే పని చేయని సిట్టింగ్‌ల చిట్టాను ముందేసుకోబోతున్నారు. ఎవరెవరిని పక్కనపెట్టాలో నిర్ణయించబోతున్నారు. ఎంతకాదనుకున్నా ఎన్నికలకు మరో ఆరేడు నెలల సమయం మాత్రమే ఉంది. బీఆర్‌ఎస్‌కు ఇది చాలా కీలకసమయం. అధినేత కేసీఆర్‌ ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ 30 మంది సిట్టింగ్‌లను మార్చే ఆలోచనలో ఉన్నారు.

ఇటీవల జరిపిన ఓ సర్వేలో కనీసం 35 మంది ఎమ్మెల్యేలపై ప్రజలల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తేలింది. ఇప్పుడు మళ్లీ వారికే టికెట్లు ఇస్తే గెలుపు అవకాశాలు సగానికి సగం తగ్గుతాయి. ఇంత రిస్క్‌ తీసుకోవడం ఎందుకన్నది కేసీఆర్‌ భావన. రాబోయే మూడు నాలుగు నెలలలో వీరంతా తమ పనితీరును మార్చుకుంటే సరి! లేకపోతే మాత్రం కేసీఆర్‌ ఆగ్రహానికి గురి కాక తప్పదు. పాలెరు, ఆలేరు, కోరుట్ల, మునుగోడు, పటాంచెరు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, కొత్తగూడెం, ఖైరతాబాద్‌, పరకాల, వరంగల్‌ ఈస్ట్‌, మెదక్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగాం, మంచిర్యాలలతో పాటు మరికొన్ని నియోజకవర్గాలలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని సర్వేలో తేలింది.

ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభిపూర్‌ రాజు, పాడి కౌషిక్‌ రెడ్డిలను అసెంబ్లీ బరిలో దింపాలని కేసీఆర్ యోచిస్తున్నారని తెలిసింది. బాన్స్‌వాడా నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్‌రెడ్డి, మునుగోడు నుంచి గుత్తా సుఖేందర్‌ రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డిలు కూడా అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరికి కేసీఆర్ ఆశీర్వాదం లభించిందని తెలంగాణభవన్‌లో వినిపిస్తున్న మాట! కేసీఆర్‌ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ రానుంది.

Updated On 4 May 2023 12:17 AM GMT
Ehatv

Ehatv

Next Story