తెలంగాణ రాజ‌ధాని(Telangana Capital) హైద‌రాబాద్(Hyderabad) న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్(Hussain Sagar) తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని(Dr. BRAmbedkar Statue)ఆయన మనవడు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్(CM KCR) ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ముందుగా జై భీమ్‌ అని సీఎం నినదించారు. సభికులు కూడా అదే ఉత్సాహంతో జై భీమ్‌(Jai Bhim )నినాదాలతో హోరెత్తించారు. 'అంబేద్కర్‌ విశ్వమానవుడు. అంబేద్కర్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనది. ఆయన ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితం కాదు.

తెలంగాణ రాజ‌ధాని(Telangana Capital) హైద‌రాబాద్(Hyderabad) న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్(Hussain Sagar) తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని(Dr. BR Ambedkar Statue)ఆయన మనవడు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్(CM KCR) ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ముందుగా జై భీమ్‌ అని సీఎం నినదించారు. సభికులు కూడా అదే ఉత్సాహంతో జై భీమ్‌(Jai Bhim )నినాదాలతో హోరెత్తించారు. 'అంబేద్కర్‌ విశ్వమానవుడు. అంబేద్కర్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనది. ఆయన ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆయన ఆశాదీపం. ఆయన చెప్పింది ఆచరించాలి. ఆ దిశగా కార్యాచరణ జరపాలి' అని కేసీఆర్‌ అన్నారు. 'సెక్రటేరియట్‌కు ఆయన పేరు పెట్టుకున్నాం. ప్రతిరోజు సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంబేద్కర్‌ను చూస్తూ ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతాలు మనసులో మెదలాలని ఈ విధంగా రూపకల్పన చేశాం' అని చప్పారు. ఇది విగ్రహం కాదని, విప్లవమని సీఎం అభివర్ణించారు. ఇది ఆకారానికి ప్రతీక కాదని, ఇది తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక అని తెలిపారు. కత్తి పద్మారావు సూచించినట్టుగా అంబేద్కర్‌ పేరిట ఒక శాశ్వతమైన అవార్డును నెలకొల్పనున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్నవారికి ఉత్తమ సేవలు అందించిన వారికి అంబేద్కర్‌ జయంతి రోజున అవార్డులు అందచేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనటువంటి ఆదర్శమూర్తి విగ్రహాన్ని తీర్చిదిద్దినందుకు ఈ అవకాశం తనకు కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బాబా సాహెబ్‌ బాటలో ఈ దేశాన్ని సరైన దిశలో పెట్టేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తామన్నారు. రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

'ప్రపంచంలో ఎక్క‌డా లేని విధంగా ద‌ళిత‌బంధు కూడా ప్ర‌వేశ‌పెట్టాం. అదే విధంగా నూత‌న స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు పెట్టుకున్నాం. ఈ నెల 30 ప్రారంభించుకుంటున్నాం. ఆకాశ‌మంతా ఎత్తు ఉండేట‌టువంటి.. ఎక్క‌డా లేని విధంగా ఈ మ‌హోన్న‌త‌మైన విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించిన ఘ‌న‌త తెలంగాణ ప్ర‌భుత్వానికే ద‌క్కింది. ద‌ళితుల అభివృద్ధి కోసం ద‌ళిత మేధావి వ‌ర్గం ఆలోచించాలి' అని కేసీఆర్‌ అన్నారు. తమ ప్రభుత్వం ద‌ళితుల అభివృద్ధి కోసం 16 వేల కోట్లు ఖ‌ర్చు చేసిందని, ఈ ప‌దేళ్లలో ద‌ళితుల అభివృద్ధి కోసం ఒక ల‌క్ష 25 వేల 68 రూపాయలు ఖ‌ర్చుపెట్టామని కేసీఆర్‌ చెప్పారు. 2024 ఎన్నిక‌ల్లో రాబోయే రాజ్యం మ‌న‌దేనని, మ‌హారాష్ట్ర‌లో ఊహించ‌ని విధంగా ప్రోత్సాహం, ఆద‌ర‌ణ వ‌స్తున్నదని, యూపీ, బీహార్, బెంగాల్‌తో పాటు ప్ర‌తి చోట మన ప్రభుత్వాలే వస్తాయని కేసీఆర్‌ పేర్కొన్నారు.
'దేశంలో ప్ర‌తి సంవ‌త్స‌రం 25 ల‌క్ష‌ల ద‌ళిత కుటుంబాల‌కు ద‌ళిత‌బంధును అమ‌లు చేస్తాం. అన్ని రాష్ట్రాల‌కు ఈ స‌దుపాయం అందుతుంది. అంబేద్క‌ర్ క‌ల‌లు సాకారం కావాలి. త‌ప్ప‌కుండా అవుతాయి. నిజ‌మైన భ‌క్తితో పేద ప్ర‌జ‌ల‌ను ఆశీర్వ‌దించాలి. విజ‌యం మ‌న‌దే. మ‌న రాష్ట్రంలో 50 వేల మందికి ద‌ళిత బంధు సాయం అందింది. ఈ ఆర్థిక ఏడాదిలో ల‌క్ష పాతిక వేల మందికి అంద‌బోతుంది. స‌ద్వినియోగం చేయాల‌ని కోరుతున్నాను' అని కేసీఆర్‌ సభాముఖంగా ప్రకటించారు.
అంతకు ముందు అంబేద్క‌ర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ఆ పూల వ‌ర్షాన్ని సీఎం కేసీఆర్, ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు వీక్షించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు. అక్క‌డున్న ప్ర‌జాప్ర‌తినిధులంతా చ‌ప్పట్ల‌తో పూల వ‌ర్షాన్ని స్వాగ‌తించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హా శిలాఫ‌ల‌కాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ ఆవిష్క‌రించారు.

Updated On 14 April 2023 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story