ముందస్తు వట్టిమాటేనంటూ ఇప్పటి వరకు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ఇవాళ బీఆర్‌ఎస్‌ ప్లీనరీ(BRS Plenary)లో ముందస్తు సంకేతాలిచ్చారు. అక్టోబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. సమయం దగ్గరపడిందని, నేతలెవరూ ఇంట్లో కూడదని, ప్రజలతో మమేకం కావాలని కేసీఆర్‌ పిలుపిచ్చారు. వంద స్థానాలు లక్ష్యంగా పని చేయాలన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా పార్టీ కోసం కలిసికట్టుగా పని చేయాలన్నారు.

ముందస్తు వట్టిమాటేనంటూ ఇప్పటి వరకు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ఇవాళ బీఆర్‌ఎస్‌ ప్లీనరీ(BRS Plenary)లో ముందస్తు సంకేతాలిచ్చారు. అక్టోబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. సమయం దగ్గరపడిందని, నేతలెవరూ ఇంట్లో కూడదని, ప్రజలతో మమేకం కావాలని కేసీఆర్‌ పిలుపిచ్చారు. వంద స్థానాలు లక్ష్యంగా పని చేయాలన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా పార్టీ కోసం కలిసికట్టుగా పని చేయాలన్నారు. లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు మానేయాలన్నారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిలను హెచ్చరించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమన్నారు. అందరూ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలన్నారు. ‘మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తాం. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలి. పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి' అని కేసీఆర్‌ అన్నారు. ఇదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చారు. దళితబంధుపై సంచలన వాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేశారని, వసూళ్లు చేసిన ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్‌ చెప్పారు. ఇదే లాస్ట్‌ వార్నింగ్‌ అని, మళ్లీ వసూళ్లు చేస్తే టికెట్‌ దక్కకపోవడం అటుంచి, పార్టీ నుంచి గెంటేస్తానని అన్నారు. మీరే కాదు, మీ అనుచరులు తీసుకున్నా మీదే బాధ్యత అని ఎమ్మెల్యేలకు చెప్పారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం.

Updated On 27 April 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story